Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా 104 అంబులెన్స్‌ల కొనుగోలుకు ఏపీ సర్కారు నిర్ణయం

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:05 IST)
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు భారీగా 104 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలనీ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 539 అంబులెన్స్ వాహనాల కొనుగోలుకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ.89.27 కోట్ల ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక 104 అంబులెన్స్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది.
 
ఇందుకు సంబందించిన నిధులను వెంటనే విడుదల చేయాలనీ ఫైనాన్స్ శాఖను ఆదేశించారు సీఎం.. రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక అంబులెన్స్ కేటాయించాలని గతంలోనే అనుకుంది ప్రభుత్వం. 
 
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మెరుగైన సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించేందుకు ఇవి ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తుంది.
 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు సరైన రవాణా వ్యవస్థ లేక ప్రాణాలు కోల్పోతున్నారని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలోనే ఈ అంబులెన్స్ లను కొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments