Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం...

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:21 IST)
ఏపీ పర్యాటక మంత్రి, సినీ నటి ఆర్కే రోజాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గాను టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమయ్యారు. ఆదివారం అర్థరాత్రి నుంచి ఆయన ఇంటివద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. దీంతో బండారును ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చన్న ప్రచారం సాగుతుంది. ఏపీ డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాసిన లేఖతో ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. 
 
మరోవైపు.. బండారుపై గుంటూరులో రెండు కేసులు నమోదయ్యాయి. నగరంపాలెం, అరండల్ పేట పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వైసీపీ కార్యకర్త మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. మంత్రి రోజాపై వ్యక్తిగత దూషణలు చేశారని ఫిర్యాదులో వైసీపీ కార్యకర్త పేర్కొన్నారు. దీంతో బండారుపై ఐపీసీ సెక్షన్ 153 (ఏ), 504, 354 (ఏ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 505, 506, 509, 499, ఐటీ చట్టం సెక్షన్-67 కింద కేసు కూడా పోలీసులు నమోదు చేశారు.
 
దీంతో.. నాటి నుంచే ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని సోషల్ మీడియా, వైసీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. ఆదివారం అర్థరాత్రి నుంచి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలోని బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. బండారు నివాసానికి వెళ్లే దారిలోని సినిమా హాలు కూడలి, వెన్నెలపాలెం ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిసున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments