Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు.. ఎక్కడ..?

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (18:32 IST)
సెల్ ఫోన్ మాయాజాలంలో యువత పడిపోయిందనేది అందరికీ తెలిసిన విషయమే. సెల్ ఫోన్ లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి చాలామంది ఎదుర్కొంటున్నారు. జీవితంలో ఒక భాగం సెల్ ఫోన్ అయిపోయింది. అయితే తన ఫ్రెండ్స్‌తో నిత్యం చాట్ చేస్తూ సెల్ ఫోన్‌కే కుమారుడు అతుక్కుపోతుండటంతో అతడిని మందలించాడు ఓ తండ్రి. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు. 
 
విజయవాడలోని పాయవరావుపేటలో నివాసముంటున్న గోపీనాథ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఫ్రెండ్స్‌తో ఫోన్లో నిత్యం చాట్ చేస్తూ ఉండేవాడు. వాట్సాప్, ఫేస్ బుక్‌లతోనే ఎప్పుడూ పని. దీంతో కుమారుడిని మందలించాడు రంగ. 
 
ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపానికి గురైన గోపీనాథ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే తండ్రి అతన్ని అడ్డుకున్నాడు. అయితే అప్పటికే గోపీనాథ్ శరీరం పాక్షికంగా కాలింది. స్థానికంగా ఉన్న ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments