Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్‌ యన్ ఐడియా సర్జీ... పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం ఆల్కహాల్

Advertiesment
వాట్‌ యన్ ఐడియా సర్జీ... పెట్రోల్‌కు ప్రత్యామ్నాయం ఆల్కహాల్
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (10:38 IST)
దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ కొట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్కహాల్ (ఇథనాల్‌)ను ఉపయోగించండి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడండి అంటూ కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.
 
ఇటీవల బస్తి రింగ్ రోడ్డు నిర్మాత పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రోల్‌కు ప్రత్యామ్నాయ వనరులను సమకూర్చుకునే దిశగా బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అంటే పెట్రోల్ స్థానంలో ఇథనాల్‌ను వాహనాలకు ఇంధనంగా వినియోగించవచ్చని, దీన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. 
 
నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు, ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఇథనాల్‌తో మోటార్ బైకులు, బసులు, ఆటోరిక్షాలు నడుస్తాయని తెలిపారు. 
 
చెరకు నుంచి ఇథనాల్‌ను చక్కెర కర్మాగారాలు ఉత్పత్తి చేస్తాయన్నారు. దీన్ని ఇంధనంగా ఉపయోగించడం వల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుందని, అది దేశ ఆర్థికాభివృద్ధికి సాయపడుతుందన్నారు. అదేసమయంలో ఇథనాల్‌ను అధిక మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల చెరకు పండించే రైతులు కూడా అధిక మొత్తంలో గిట్టుబాటు ధరను పొందవచ్చని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాయ్‌ఫ్రెండ్ వ్యవహారం అమ్మకు చెబుతాడనీ... తమ్ముడిని ఊపిరాడకుండా చేసి...