లీటరు పెట్రోల్ ధరపై రూ.5 తక్కువగా లభించే రాష్ట్రాలు ఏవి?
దేశంలో పెట్రోమంట ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనంగా లీటరుపై రూ.2.50 పైసలును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
దేశంలో పెట్రోమంట ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనంగా లీటరుపై రూ.2.50 పైసలును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ధరలు పెరుగుతూ ఉంటే చూస్తుండిపోయిన ప్రభుత్వం, ఇప్పుడు నామమాత్రంగా తగ్గించి పండగ చేసుకోమన్నట్టు చెప్పడమేంటని ప్రశ్నిస్తున్నారు. చాలా దేశాల్లో పెట్రోలును రూ.35కే విక్రయిస్తున్నారని, భారత్‌లో రూ.90 వసూలు చేస్తూ, కేవలం రెండున్నర రూపాయలు తగ్గించడం ఏంటని అడుగుతున్నారు.
పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రానున్నందునే ఈ రెండున్నరను డిస్కౌంట్‌గా ఆఫర్ చేస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్న బీజేపీ, తమ అవినీతి నుంచి వారి దృష్టిని మరల్చేందుకే పెట్రోలు తాయిలం ప్రకటించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
ఇకపోతే, దేశంలో లీటరు పెట్రోల్ ధరపై రూ.5 తక్కువగా లభించే రాష్ట్రాలను పరిశీలిస్తే, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, అస్సోం, త్రిపుర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ రూ.5 తక్కువగా లభిస్తోంది.