Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెట్లెక్కుతున్న ఉపాధ్యాయులు.. ఎందుకో తెలుసా?

జార్ఖండ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు లేనిపోని కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల కష్టాలు అన్నీఇన్నికావు. తాము పాఠశాలకు వచ్చినట్టుగా హాజరు వే

చెట్లెక్కుతున్న ఉపాధ్యాయులు.. ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 5 అక్టోబరు 2018 (13:22 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు లేనిపోని కష్టాలు వచ్చిపడ్డాయి. ముఖ్యంగా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల కష్టాలు అన్నీఇన్నికావు. తాము పాఠశాలకు వచ్చినట్టుగా హాజరు వేసేందుకు వారు చెట్లు ఎక్కాల్సి వస్తోంది. అటెండెన్స్ కోసం టీచర్లు చెట్టు ఎక్కడం ఏంటి అనే కదా మీ ధర్మసందేహం. అయితే, ఈ కథనం చదవండి...
 
జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల అటెండెన్స్‌ను ట్యాబ్లెట్లలో నమోదు చేయాల్సి వుంది. ఈ-విద్యా వాహిని ఆప్ ద్వారా తాము విధులకు హాజరైనట్టు అటెండెన్స్ వేసుకోవాలి. 
 
కానీ పాఠశాల అటవీ ప్రాంతంలో ఉండటంతో సరైన సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందడం లేదు. దీని కోసం పాఠశాల ఆవరణలోని చెట్లను ఎక్కాల్సి వస్తోంది. మరి 20 సంవత్సరాల పైవయసున్న వారు చెట్లు బాగానే ఎక్కి ట్యాబ్లెట్‌లో హాజరు నమోదు చేసుకుంటున్నారు. కానీ 40 యేళ్ల వయసున్న స్త్రీ పురుష టీచర్లు చెట్లు ఎక్కడం కష్టంగా మారింది. 
 
దీంతో వారు తమ హాజరు శాతాన్ని నమోదు చేసుకోలేకపోతున్నారు. ఈ స్కూల్‌లో ఉన్న ఆరుగురు ఉపాధ్యాయులు.. హాజరు నమోదు విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. 2017లో జ్ఞానోదయ స్కీం కింద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్.. ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబెట్లు పంపిణీ చేశారు. ఈ-విద్యా వాహిని ఆప్ ద్వారా ఉపాధ్యాయులు తమ అటెండెన్స్‌ను నమోదు చేసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్కులో కాదు.. గుడిలోనే ఆ ప్రేమ జంట కామకాలాపాలు.. చివరికి?