Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్? ఎలా?

Advertiesment
ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్? ఎలా?
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (09:09 IST)
పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. ఇటీవల లీటరు పెట్రోల్ ధర రూ.90ను దాటి సెంచరీకి చేరువైంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికాతో రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోయింది. ఈ ప్రభావం పెట్రోల్ ధరలపై చూపింది. ఫలితంగా పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోయాయి.
 
అయితే, ఇపుడు భారతీయ స్టేట్ బ్యాంకు తన ఖాతాదారులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా ఐదు లీటర్ల పెట్రోల్ ఇవ్వనుంది. ఇందుకోసం ఎస్.బి.ఐ కస్టమర్లు ఓ చిన్నపని చేయాల్సివుంటుంది. 
 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో కేవలం 100 రూపాయలకు పెట్రోల్ కొనడమే. ఈ పెట్రోల్‌ను "భీమ్ ఎస్.బి.ఐ పే" అనే యాప్‌ ద్వారా కొనుగోలు చేయాల్సివుంటుంది. ఇలా చేసే ఎస్.బి.ఐ ఖాతాదారులు ఉచితంగా 5 లీటర్ల పెట్రోల్ పొందొచ్చు.
 
నిజానికి ఈ ఆఫర్ నవంబరు 23వ తేదీ వరకు మాత్రమే ఉండేది. కానీ, ఈ ఆఫర్‌ను డిసెంబరు 15వ తేదీ 2018 వరకు పొడగించారు. ఈ విషయాన్ని ఎస్.బి.ఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. సో.. ఇకెందుకు ఆలస్యం రూ.5 లీటర్ల పెట్రోల్‌ను ఉచితంగా పొందేందుకు ట్రై చేయండి. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్ దంపతులతో సీఎం కేసీఆర్ కుటుంబం(ఫోటోలు)