Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం కుంకుమపువ్వును ఆహారంలో చేర్చుకుంటే?

Advertiesment
Thursday
, బుధవారం, 5 డిశెంబరు 2018 (19:15 IST)
గురువారం పూట బృహస్పతిని పూజిస్తే.. జీవితంలో విజయానికి ఢోకా వుండదు. దేవ గురువైన బృహస్పతిని పూజించడం ద్వారా నవగ్రహాల దోషాలను నివృత్తి చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అలాగే గురువారానికి బృహస్పతి అధిపతి. అందుకే ఆ రోజున సత్యనారాయణ స్వామిని పూజించేవారికి ఈతిబాధలుండవు. ఇంకా గురువారం పూట విష్ణువు ఆలయాల్లో దర్శించుకునేవారికి సకలసంపదలు చేకూరుతాయి. 
 
సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి.. విష్ణుమూర్తిని ధ్యానించి.. పూజించడం ద్వారా సర్వసుఖాలు చేకూరుతాయని విశ్వాసం. గురువారం పూట కుంకుమపువ్వును ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మహిళలు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకోవాలి. ఇది ఆరోగ్యానికి చలువ చేయడంతో పాటు.. విష్ణువుకు ప్రీతికరమని పండితులు చెప్తున్నారు. 
 
గురువారం పూట పసుపు రంగుతో కూడిన వస్తువులు, ఆహార పదార్థాలు, పువ్వులు, దుస్తులను తమకు చేతనైనంత ఇతరులకు దానం చేయడం ద్వారా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు వుండవని.. అదృష్టం వరిస్తుందని పండితుల వాక్కు. అలాగే శివునికి లడ్డూలను గురువారం నైవేద్యంగా సమర్పించి.. ప్రసాదంగా స్వీకరించాలి. ముఖ్యంగా అరటిపండ్లను గురువారం ఇతరులకు దానం చేయడం ద్వారా ప్రశాంతత చేకూరుతుంది. గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
గురువారం పూట ఆహారంలో ఎంత మటుకు ఉప్పు తగ్గించుకుంటే అంత మంచిది. ఇంకా గురువారం పూట లక్ష్మీదేవిని మీకు నచ్చిన స్తోత్రంతో స్తుతిస్తే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వుండవు. గురువారం పూట ఒంటిపూట భోంచేసి.. సాయంత్రం పూట శివకేశవులకు నేతి దీపం వెలిగించిన వారికి వైవాహిక ఇబ్బందులు వుండవు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం పూట ఉపవాసం వుండి.. పసుపు రంగు పువ్వులతో బృహస్పతిని పూజించి, శెనగపప్పు, లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా సంపద చేకూరుతుంది. సమస్త దోషాలు తొలగిపోతాయి. 
 
ఇలా మూడు వారాల పాటు చేసి.. మూడో వారం కుంకుమ పువ్వు కలిపిన పాలతో బృహస్పతికి అభిషేకం చేయించాలి. గురువారం పూట నీటిలో పసుపు రంగు వస్తువుల్లో, ఆహారంలో బృహస్పతి వుంటాడని విశ్వాసం. అందుకే గురువారం ఆయనను తలచి ఉపవసించి.. పూజలు, నైవేద్యాలు సమర్పించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హలో అన్నదమ్ములూ.... గృహాన్ని పంచుకుంటున్నారా.. జాగ్రత్త..?