Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్ల ఏనుగును చంపేసిందని విద్యుత్ స్తంభాన్ని నుజ్జునుజ్జు చేసిన తల్లి ఏనుగు...

Webdunia
సోమవారం, 22 జులై 2019 (22:07 IST)
మనుషులకే కాదు జంతువులకు ప్రేమ ఉంటుందని నిరూపించింది ఒక ఏనుగు. పలమనేరు మండలంలో గత కొన్నిరోజుల నుంచి ఏనుగులు భీభత్సం సృష్టిస్తున్నాయి. తిండి కోసం అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. 
 
పలమనేరు మండం జి.కోటూరులో ఒక ఏనుగు తన పిల్ల ఏనుగును వెంట పెట్టుకుని నిన్న ఉదయం పంటలపైకి వచ్చింది. రైతుల పంటలను ధ్వంసం చేస్తూ కనిపించింది. తల్లితో పాటు పిల్ల ఏనుగు రాకుండా కరెంట్ తీగలు పెట్టిన ప్రాంతంలోకి వెళ్ళింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై తల్లి ఏనుగు చనిపోయింది.
 
దీంతో నిన్న రెండు గంటల పాటు పెద్ద ఏనుగు పిల్ల ఏనుగు చుట్టూ తిరుగుతూనే కనిపించింది. అటవీ శాఖాధికారులు ఆ ఏనుగును అటవీ ప్రాంతంలోకి తరిమేశారు. అయితే తన పిల్ల ఏనుగు మరణానికి కారణమైన విద్యుత్ స్థంభాన్ని గుర్తుపెట్టుకున్న తల్లి ఏనుగు కసితో ఆ స్థంభాన్ని ధ్వంసం చేసింది.
 
ఈరోజు తెల్లవారుజామున పొలంలోకి వచ్చి విద్యుత్ స్థంభాన్ని నుజ్జునుజ్జు చేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంతువులకు కూడా ప్రేమ, కోపం ఉంటుందని అటవీశాఖాధికారులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments