Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అమరావతిలో ఎలా పర్యటిస్తారో చూస్తాం.. రైతుల హెచ్చరిక

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (12:26 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28వ తేదీన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు క్షమాపణ చెప్పి చంద్రబాబు రాజధానిలో అడుగు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. 
 
రైతు అభిప్రాయ సేకరణ ద్వారా రభస సృష్టించి మాపై కేసులు పెట్టించి గత ప్రభుత్వ స్ధానిక ఎమ్మెల్యే భయపెట్టారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు మా చుట్టూ తిరిగి మాకు బొమ్మలు చూపించారు. గత మూడేళ్ళలో అన్నీ తాత్కాలికమే.. ఒక్క మంచి పని జరగలా... మాకు అన్యాయం జరిగింది.
 
గత ప్రభుత్వంలో మేము మోసపోయాం...చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టే ముందు మాకు గతంలో ఇచ్చిన హామీల విషయంపై సమాధానం చెప్పి రావాలి. ఉచిత వైద్యం, విద్య, ప్లాట్ల పంపిణీ పెద్ద గోల్‌మాల్ జరిగింది.
 
 మాజీ మంత్రి నారాయణ కమీషన్ల కక్కర్తి వలనే రోడ్లు,‌ ఇతర కన్ స్ట్రక్షన్స్ అన్నీ అసంపూర్ణంగా జరిగాయి. రాజధాని అభివృద్ధి విషయంలో టీడీపీ నేతలకు కు ఎంతెంత కమిషన్లు అందాయో చెప్పాలి.. రాజధానికి భూములు వైసిపి నేతలు ఇచ్చారే తప్ప టిడిపి నేతలు వాళ్ళు భూములివ్వలేదు. 
 
రాజధానిలో 9 వేల ఎకరాలు గత టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు కొన్నారు. మా‌ కిచ్చిన ప్లాట్ల మధ్యలో 25 లక్షల గజాలు హోల్డ్‌లో ఎందుకు పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
 
రైతులకు సమాధానం చెప్పకుండా రాజధాని‌లో ఎలా పర్యటిస్తారో చూస్తాం. గతప్రభుత్వం అసైన్డ్ భూములకు ఎందుకు తక్కువ ప్యాకేజ్ ఇచ్చారు.  చంద్రబాబు రాజధానిలో పర్యటించాలంటే  దళితులకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదంటే తీవ్రంగా ప్రతిఘటిస్తాం.

చంద్రబాబు 28న రాజధాని ప్రాంతానికి రావొద్దని సూచిస్తున్నామని రాజధాని ప్రాంత వాసులు, రైతులు హెచ్చరిస్తున్నారు.మూడు సంవత్సరాలు‌లో ఫ్లాట్స్ అభివృద్ధి చేస్తామన్న అప్పటి ప్రభుత్వం ఎందుకు చేయలేదని వారు ప్రశ్నించారు. ఇంకా రాజధాని అమరావతిలో నిర్మించేందుకు పూర్తి మద్దతు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments