Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె : ప్రైవేటీకరణపై కేసీఆర్ చర్చలు

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (12:25 IST)
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 52వ రోజుకు చేరుకుంది. కార్మికులను విధుల్లోకి తీసుకొనే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సమ్మెలో పాల్గొన్నవారంతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, బస్టాండ్‌లు, ప్రధాన కూడల్లో సేవ్ ఆర్టీసీ పేరుతో కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. 
 
హయత్ నగర్ 1,2 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగారు. తమని విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ డిపో ముందు బైటాయించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని కార్మికులు హెచ్చరించారు. తమను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు.
 
మరోవైపు ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై సీఎం కేసీఆర్ సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులకో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం అఖిపక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలు మరోసారి సమావేశంకానున్నారు. 
 
అదేసమయంలో ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన సెప్టెంబర్ నెల జీతభత్యాల సోమవారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. 48 వేల 190 మంది కార్మికులకు సెప్టెంబరు నెల జీతభత్యాలు ఇవ్వాలని మజ్దూర్ యూనియన్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments