Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకు పనికిరాడని భర్తను చంపి.. వేరొకడితో....

శారీరక సుఖం కోసం భర్తలను చంపే భార్యల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భర్త సుఖానికి పనికిరాడని తెలిస్తే విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లాడవచ్చు. కానీ కొంతమంది మహిళలు ఏకంగా భర్తను చంపేయడమే చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఎలమంచిలిలో జరిగింది. దిమిలికి చెం

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (15:23 IST)
శారీరక సుఖం కోసం భర్తలను చంపే భార్యల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. భర్త సుఖానికి పనికిరాడని తెలిస్తే విడాకులు ఇచ్చి మరో వ్యక్తిని పెళ్లాడవచ్చు. కానీ కొంతమంది మహిళలు ఏకంగా భర్తను చంపేయడమే చేస్తున్నారు. అలాంటి సంఘటనే ఎలమంచిలిలో జరిగింది. దిమిలికి చెందిన నాగేశ్వర రావుకు, నర్సీపట్నంకు చెందిన వీరలక్ష్మికి 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిద్దరు మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. నాగేశ్వరరావు అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం నుంచి మంచం పట్టాడు. దీంతో వీరలక్ష్మి కూరగాయల వ్యాపారం చేస్తూ వస్తోంది. 
 
భర్త సుఖానికి పనికిరాక పోవడంతో మార్కెట్లో పనిచేస్తున్న మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు అసలు విషయం తెలిసి మందలించాడు. అయినా సరే వీరలక్ష్మిలో ఎలాంటి మార్పు రాలేదు. తన సుఖానికి నాగేశ్వరరావు అడ్డొస్తున్నాడని, అది సహించలేని వీరలక్ష్మి తన భర్తకు ఉరేసి చంపేసింది. 
 
రాత్రి వేళలో నిద్రిస్తున్న నాగేశ్వరరావు తలపై గట్టిగా కొట్టి అతడు స్పృహ తప్పిన తరువాత ఇంటి ఫ్యాన్‌కు ఉరివేసి చంపేసింది. ఆ తరువాత బంధువులను పిలిచి తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టుమార్టంలో విషయం కాస్త బయటపడటంతో అసలు విషయాన్ని పోలీసులకు తెలిపింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments