Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాకు వెళ్దామని నమ్మించి బాలికపై అత్యాచారం... అవమానంతో బాలిక...

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (19:54 IST)
సినిమాకు వెళ్దామని నమ్మించి ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక నిందితుడు బాలుడు కావడం గమనార్హం. ఈ దారుణం జిల్లా కేంద్రమైన వరంగల్ పట్టణంలోని సమ్మయ్య నగరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సమ్మయ్య నగర్‌కు చెందిన 15 బాలిక తల్లిదండ్రులు కోల్పోయి తన నాన్నమ్మ వద్ద ఆశ్రయం పొందుతూ తొమ్మిదో తరగతి చదువుతోంది. 
 
ఈ క్రమంలో హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్‌ అనే యువకులతో బాలికకు పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త చాలా చనువుగా మారింది. దీంతో శనివారం బాలిక ఇంటికి వచ్చిన యువకులు.. సినిమాకు వెళ్దాం రమ్మని ఆ బాలికను నమ్మించడంతో ఆ బాలిక బైకు ఎక్కింది. 
 
ఆ తర్వాత పెంబర్తి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ బాలికపై సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు. వీరితోపాటు మరో బాలుడు కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడు. అనంతరం ముగ్గురూ పరారయ్యారు.
 
ఆ తర్వాత ఆ బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వదిలి వెళ్లిపోయారు. ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని నాన్నమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత తనకు జరిగిన ఘటనను తలుచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు తిరుపతి, ప్రసన్నకుమార్‌ల కోసం గాలిస్తున్నారు. కాగా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments