Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరకట్న వేధింపులకు నవ వధువు బాత్రూమ్‌లో ఉరివేసుకుంది..

Advertiesment
వరకట్న వేధింపులకు నవ వధువు బాత్రూమ్‌లో ఉరివేసుకుంది..
, శుక్రవారం, 9 ఆగస్టు 2019 (12:28 IST)
వరకట్న వేధింపులకు మరో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్ నగరం శివారు ప్రాంతమైన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఒంగోలు జిల్లాకు చెందిన నర్సింహ్మా, అంజమ్మ దంపతులు పొట్టకూటి కోసం కాప్రాకు వచ్చి స్థిరపడ్డారు. తమ కూతురు శ్రావణి(20)ని గత 5 మాసాల క్రితం  ఆర్‌ఎల్‌నగర్‌లో నివాసం ఉంటున్న  రామంజనేయులు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం సమయంలో ఐదు లక్షల రూపాయల మేరకు వరకట్న కానుకలు ఇచ్చారు.
 
అయితే, ముగిసిన కొన్ని రోజుల తర్వాత భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించసాగారు. అదనపు కట్నం కోసం అత్తమామ భర్త వేదింపుల విషయాన్ని శ్రావణి తన తల్లిదండ్రులకు కుడా తెలపడంతో తల్లిదండ్రులు మరో  రూ.5 లక్షలు కూడా ఇచ్చేందుకు అంగీకరించారు.
 
ఈ క్రమంలో గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రావణి బాత్రూమ్‌లోకి వెళ్ళి గడియపెట్టుకుని ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
ఈ విషయాన్ని గమనించిన భర్త, కుటుం బసభ్యులు శ్రావణిని నాగారంలో ఉన్న విజయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు శ్రావణిని పరిక్షించి అప్పటికే శ్రావణి మృతిచెందిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో భర్తతో పాటు.. అత్తామామ, అడపడుచును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ వర్షాలు : వరదలకు 14 మంది మృతి - విమానాశ్రయం మూసివేత