Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పుర, నగరపాలక ఎన్నికలకు 9,308 కేంద్రాలు

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:50 IST)
ఏపీలో మార్చి 10ననిర్వహించనున్న పుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు పురపాలక శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం 12 నగరపాలికలు, 75 పురపాలికలు, నగర పంచాయతీల్లో మొత్తం 9,308 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది.

ఈ పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 91,17,511 మంది ఓటర్లున్నారు. ఎన్నికల విధుల కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని గుర్తించింది. ఈ మేరకు పోలింగ్‌ కేంద్రాలు, పురపాలక సంఘాలవారీగా సిబ్బంది ఇతరత్రా వివరాలతో రూపొందించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు అందించింది.

అత్యధికం విశాఖలోనే...
* అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,818 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కృష్ణాలో 1,124, గుంటూరులో 1,078 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 111 పోలింగ్‌ కేంద్రాలున్నాయి.
* నగర, పురపాలికలు, నగర పంచాయతీలవారీగా చూస్తే విశాఖలో 18,36,224 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలులో 10,85,758, గుంటూరులో 10,77,617, కృష్ణాలో 10,76,374 మంది ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేవలం 96,574 మంది ఓటర్లున్నారు.
పూర్తికాని సిబ్బంది కేటాయింపు
ఎన్నికల నిర్వహణ కోసం 55,840 మంది సిబ్బంది అవసరమని పురపాలక శాఖ గుర్తించింది. విధుల కోసం ఇప్పటివరకూ 48,181 సిబ్బందిని గుర్తించామని, 43,021 మంది కేటాయింపు పూర్తయిందని నివేదికలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments