Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితను ఒకరు పట్టుకోగా మరొకరు అత్యాచారం.. అసలక్కడ ఏం జరిగింది?

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (10:55 IST)
పుట్టింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన వివాహిత అత్యాచారానికి గురైంది. నమ్మి ఆటో ఎక్కిన పాపానికి ఆటో డ్రైవర్‌, మరో వ్యక్తితో కలిసి సదరు వివాహితను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం మల్లారానికి చెందిన ఓ వివాహిత తన స్వస్థలమైన కరకగూడెం మండలంలోని బర్లగూడేనికి వెళ్లేందుకు ఏడూళ్లబయ్యారం క్రాస్‌ రోడ్డు వద్ద ఆటో ఎక్కింది.

ఆ సమయంలో ఆటోలో డ్రైవర్‌తో పాటు మరోవ్యక్తి ఉన్నాడు. ఈక్రమంలో రాళ్లవాగు పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు రాగానే ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆటోను ఇటు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ సదరు వివాహిత ప్రశ్నిస్తున్నా ఖాతరు చేయలేదు.

వివాహితను ఒకరు పట్టుకోగా మరొకరు అత్యాచారం చేశారు. పైగా ఆమెను కొట్టి చిత్రహింసలు పెడుతుండటంతో ఆ దెబ్బలకు తాళలేక కేకలు వేస్తుండటంతో ఆ ప్రాంతంలో కొండచీపురు పుల్లలు కోస్తున్న మహిళలు ఆమె కేకలు విని ఘటనాస్థలానికి వచ్చారు.

వారి రాకను గమనించిన నిందితులు పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు. జరిగిన విషయాన్ని బాధితురాలు ఆ మహిళలకు చెప్పగా అప్పటికే చీకటి పడటంతో వారు ఇళ్లకు వెళ్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాధితురాలు, సాక్షుల వివరాల ప్రకారం ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments