Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 711 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపేయండి: సీఎం జగన్

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (23:30 IST)
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించిన దాదాపు 700 మందికి పైగా క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించబడ్డారు. ఈ ఉద్యోగులు అందరూ కూడా తమను తమ రాష్ట్రానికి పంపాలని గత ఐదారు సంవత్సరాలుగా కోరుతూనే ఉన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటి సమావేశంలో ఈ ఉద్యోగుల అంశాన్ని అజెండాలో చేర్చి తెలంగాణ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి తెలంగాణ నేటివిటి కలిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న 711 మంది ఉద్యోగులను అక్కడి ప్రభుత్వంలో తీసుకోవడానికి అంగీకారం తెలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం కోసం ఇక్కడికి లేఖ రాయడం జరిగింది. ఈ విషయంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి 711 మంది క్లాస్ 3, క్లాస్ 4 తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు పంపుటకు ఆమోదం తెలుపవలసిందిగా కోరడం జరిగింది.

దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ రోజే ఆమోదం తెలిపి ఈ రోజే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారిని ఆదేశించడం జరిగింది. అడిగిన వెంటనే తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ రాష్ట్రానికి పంపడానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరుపున సచివాలయ ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
 
అలాగే పంచాయతీరాజ్ శాఖ లోని అన్ని సంఘాలు అన్ని ఉద్యోగులను కలుపుతూ కొత్తగా ఏర్పడిన పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సీఎం గారికి పరిచయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవో ప్రమోషన్ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని సీఎం గారిని కోరగా సీఎం గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా ఎంపిడివోలు ప్రమోషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు అని వెంకట్రాంరెడ్డి, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments