Webdunia - Bharat's app for daily news and videos

Install App

2 బ్యాగుల నిండా బంగారం.. అది పులివెందులదేనా?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:47 IST)
పంచాయతీ ఎన్నికల వేళ వైఎస్సార్ కడప జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పులివెందుల నుంచి వస్తున్న ఓ కారులో 2.7 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ హరినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ముద్దనూరు నాలుగు రోడ్ల కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు.
 
అదే సమయంలో పులివెందుల నుంచి ముద్దనూరు వైపు వస్తున్న ఓ కారును నిలిపివేశారు. ఈ సందర్భంగా కారులో తనిఖీ చేపట్టగా.. అందులో ఉన్న రెండు బ్యాగుల్లో 2.7 కేజీల బంగారు ఆభరణాలను గుర్తించారు. వెంటనే కారు డ్రైవర్‌ మహమ్మద్‌ షఫీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. పులివెందులలోని ఓ బంగారు ఆభరణాల దుకాణం నుంచి మెరుగు పెట్టించడానికి ప్రొద్దుటూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు.
 
అయితే ఆభరణాలకు సంబంధించిన బిల్లులు లేకపోవటంతో కారుతో పాటు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.1.05 కోట్లు ఉంటుందని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను తిరుపతి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అందించినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments