Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెమ్మ దెబ్బకు అన్నయ్యకు నిద్రలేని రాత్రులు .. వణికిపోతున్న తాడేపల్లి ప్యాలెస్!!

PNR
బుధవారం, 20 మార్చి 2024 (15:59 IST)
సొంతచెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి నిద్రలేకుండా చేస్తున్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చేందుకు ఎంతో సాయం చేసిన చెల్లి షర్మిల.. ఇపుడు తమ పార్టీ ఓటమికి కారకురాలవుతారన్న భయంతో తాడేపల్లి ప్యాలెస్ పాలకులు వణికిపోతున్నారట. గత ఐదేళ్ళుగా వైకాపా అధికారంలో ఉంది. పైగా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేక ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైవు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. అదేసమయంలో వైఎస్ షర్మిల రూపంలో కూడా వైకాపాకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ప్రస్తుతం వైకాపాలో షర్మిలను అభిమానించేవారు ఉన్నారు. అయితే, తాజాగా విశాఖపట్టణంలో కాంగ్రెస్ నిర్వహించిన సభతో ఆ పార్టీకి జవజీవాలు కల్పించారనే చర్చ సాగుతుంది. దీంతో వైకాపా ఓటు బ్యాంకులో 2 శాతం కాంగ్రెస్ పార్టీకి మళ్లినా... తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వైకాపాలో కనిపిస్తుంది. అదే జరిగితే వైకాపాకు ఓటమి తథ్యమని వైకాపా నేతలే తమ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందనే చర్చ జరుగుతుంది. వైకాపాపై షర్మిల ప్రభావం ఏ మేరక ఉందనేది ఎన్నికల ఫలితాలతో తేలనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments