Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ పోటీలో లేకుంటే పిఠాపురం అభ్యర్థిని నేనే : ఎస్వీఎస్ఎన్ వర్మ

సెల్వి
బుధవారం, 20 మార్చి 2024 (14:32 IST)
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో లేకుంటే తానే అభ్యర్థిగా పోటీలోవుండేవాడినని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లాంఛన ప్రాయమేనని అన్నారు. తాను గత రెండు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతూ పార్టీ పురోగతితో పని చేస్తున్నట్టు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పవన్ కోసం తన సీటును త్యాగం చేసినట్టు చెప్పారు. ఎంతో బాధతో ఈ స్థానాన్ని వదులుకున్నా. ఆయన విజయానికి కృషిచేస్తా. పవన్‌ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి తానే బరిలో ఉంటానని చెప్పారు. 
 
మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో పోటీపై స్పందించారు. 'కేంద్ర పెద్దలు శాసనసభ, లోక్‌సభ స్థానాలు రెండింటిలోనూ పోటీ చేయాలన్నారు. శాసనసభకు పోటీ చేయడమే నాకు ఇష్టం. రాష్ట్రానికి ముందు పని చేసి ఆ తర్వాత దేశం కోసం ఆలోచిస్తా. ఒకవేళ లోక్‌సభకే పోటీ చేయాలని మోడీ, అమిత్‌షా అడిగితే అప్పుడు కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తా. ఆ పరిస్థితుల్లో ఉదయ్‌ శ్రీనివాస్‌ పిఠాపురం నియోజకవర్గానికి వస్తారు' అని పవన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments