Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 225 సీట్లు ఇవ్వాలి : విజయసాయి రెడ్డి

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:43 IST)
విశాఖపట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నోరు జారారు. వీటిపై విపక్షాలతో పాటు.. నెటిజన్లు తమదైనశైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా, తెలుగుదేశం, జనసేన పార్టీలు విజయసాయి రెడ్డిపై చేస్తున్న ట్వీట్లను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 
 
ఈ పుట్టినరోజు వేడుకల్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, 'ఈసారి 151 సీట్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని 225 స్థానాలకుగానూ 224 స్థానాల్లో గెలిపించాలి' అని కోరారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీలో ఉన్నది 175 స్థానాలే కదా.... 225 ఎక్కడివి అంటూ ట్రోల్ చేస్తున్నారు. నవ్యాంధ్రలోని 175 సీట్లు మాత్రమేకాదు 25 లోక్‍సభ సీట్లను కలపుకున్నా 225 సీట్లు రావుకదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయికి దొంగ లెక్కలు వేయడంలో మంచి దిట్టగా పేరున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ 'పెద్ది' ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరిపోయే ధర!

ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామంటున్న మెగాస్టార్! (Video)

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments