Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపా నేతలు నాకు దండం పెట్టాలి... సూట్ కేసు రెడ్డికి బెత్తం దెబ్బలు పడాలి : పవన్ కళ్యాణ్

వైకాపా నేతలు నాకు దండం పెట్టాలి... సూట్ కేసు రెడ్డికి బెత్తం దెబ్బలు పడాలి : పవన్ కళ్యాణ్
, బుధవారం, 4 డిశెంబరు 2019 (19:38 IST)
నిజానికి వైసీపీ నాయకులు నేను కనబడితే నాకు దండం పెట్టాలి. వాళ్ళు అంటున్నట్టు నేను ఆరోజు బీజేపీ-టీడీపీతో కలిసి పోటీ చేసి ఉంటే ఈరోజు వైసీపీ నాయకులు ఏ స్థాయిలో ఉండేవాళ్ళో ఆలోచించుకోవాలి అని వైకాపా నాయకులను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ రెడ్డి గారే తెలుగు మాధ్యమం పై దాడి చేస్తున్నారు. జనసేన ఏనాడూ ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదు. తెలుగు మాధ్యమాన్ని చంపకండీ అని చెబుతున్నాం. సూటు కేసు (విజయసాయి) రెడ్డి గారు, మీరు ఆ రెండు బెత్తం దెబ్బలు తింటే ఐనా మారతారేమో అని వ్యాఖ్యానించారు.
 
పైగా, తాను హిందూ ధర్మ సంరక్షణపై మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్న కొన్ని మీడియా సంస్థలకు చెంప పగిలేలా పవన్ సమాధానం చెప్పారు.70 శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటారు. ఉద్యోగాలు ఇవ్వాలంటే ముందు పరిశ్రమలు రావాలి కదా? రాయలసీమ యువత వలసలు వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు చాలా కష్టపడాలి. కియా సంస్థ ఒకటి వస్తే ఆ సంస్థ సీఈవోని కూడా వైసీపీ వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు బయటకు వెళ్లి ఏం చెప్తారు? 
 
రాయలసీమ యువతకు ఊర్లలో ఉండాలని ఉంటుంది కానీ ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే ప్రజాప్రతినిధులకు ఇక్కడి యువత భయపడాలి లేదా వత్తాసు పలకాలి, అలా అయితేనే ఇక్కడ ఉంటారు లేదంటే వలసలు వెళ్లిపోయే పరిస్థితి ఉంటుందన్నారు.
 
మీ దృష్టి అంతా కూల్చివేతలు, రద్దులపై ఉండడం వల్ల భవన నిర్మాణ కార్మికులతో మొదలు అనేక లక్షల మంది ప్రజలు ఈరోజు బాధలు పడుతున్నారు. ఇది దయచేసి వైసీపీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. 
 
ఇంత ఘనమైన మెజారిటీ వచ్చిన ప్రభుత్వం కూల్చివేతల పైన పెట్టిన శ్రద్ధ సామాన్యుడికి ఏం చేయాలి అనే దానిపై పెట్టలేదు. మీ ద్వేషం వల్ల విలువైన 6 నెలల కాలం వృథా అయిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రైతులకు కోల్డ్ స్టోరేజీలు కూడా లేవు. కోల్డ్ స్టోరేజీలు ఉంటే రైతులు పంటలను నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుంటారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం బాధాకరం.
 
ఈ రాయలసీమ పర్యటనలో మాకు ముఖ్యంగా రైతులు చెప్పింది కండలు కరిగించి పసుపు, ఉల్లి మొదలగు పంటల పండిస్తే వాటికి కనీస గిట్టుబాటు ధర లభించట్లేదు అని పవన్ గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య... భర్త కొట్టినందుకు కాదట... తోడి కోడలు తొంగి చూసినందుకట..