Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు పెద్దగా తెలుగు రాదు... అంత దారుణంగా అనడం సరికాదు... ఆర్ఆర్ఆర్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (16:31 IST)
తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌కు తెలుగు పెద్దగా రాదని వ్యాఖ్యానించారు. పైగా, కరోనాతో సహజీవనం చేయాలంటూ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరికాదు అని వ్యాఖ్యానించారు. 
 
సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో రఘురామకృష్ణంరాజు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, 'అది కూడానా. ఇది ఇప్పటికిప్పుడు పోయేది కాదన్న కోణంలో ఆయనకు వచ్చిన తెలుగులో అలా చెప్పారు. ఆయనకు పెద్దగా తెలుగు రాదు. సహజీవనం అనే మాట అలా వాడారు. దాన్ని మీరు అంతదారుణంగా అనడం సరికాదు. 
 
కరోనాను సీరియస్‌గా చూడాలి. చాలా బాధపడాల్సిన విషయం. దీనిపై సమీక్షలు చేయకుండా... తెల్లారి లేస్తే కోర్టు కేసులు. విశాఖ వెళ్లిపోవాలన్న తొందర. కరోనా లాంటి విపవత్తుపై దృష్టి పెట్టాలి. రాబోయే రోజుల్లో వ్యవసాయం పనులు మొదలు అవుతాయి. ఇంత కష్టకాలంలో కరోనా విపత్తు కాలంలో ఫోకస్ చేయకుండా.. గ్రామ పరిస్థితులను వ్యవసాయ పనులను అంచనావేయకుండా.. కోర్టులతో మొట్టికాయలు తింటున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
తన పార్లమెంట్ నియోజకవగర్ంలో 30-35 మంది పేషంట్లు లేని గ్రామం లేదన్నారు. దేశంలోనే ఎక్కువగా ఏపీలో కరోనా కేసులు ఉన్నాయని తెలిపారు. రాజధాని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, ఆ సీ (క్యాపిటల్)కాకుండా ఈ సీ(కరోనా)పై దృష్టిపెట్టాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

Madhuram: తినడం మానేసి కొన్ని రోజులు నీళ్లు మాత్రమే తాగాను : ఉదయ్ రాజ్

డా. చంద్ర ఓబులరెడ్డి ఆవిష్కరించిన ఏ ఎల్ సీ సీ. ట్రెయిలర్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments