Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతుల తరపున వాదించకుండా ఉండేందుకు రూ.కోట్ల ఆఫర్ : ఆర్ఆర్ఆర్

Advertiesment
YSRCP MP Raghu Ramakrishnam Raju
, గురువారం, 27 ఆగస్టు 2020 (14:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై అధికార వైకాపాకు చెందిన అసంతృప్తి ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోణలు చేశారు. అమరావతి రైతుల తరపున కోర్టుల్లో వాదించకుండా ఉండేందుకు వైకాపా ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఆఫర్ చేస్తోందన్నారు. ప్రజాధనం వృథా చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో ముందుముందు చూద్దామని ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయం పూర్తిగా అమరాతి రైతుల పక్షాన నిలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందన్న మనోధైర్యంతో మహిళలు, రైతులు ముందుకువెళుతున్నారని, గాంధేయ మార్గంలో సాగాలని పిలుపు ఇచ్చారు. 
 
ప్రముఖ న్యాయవాదులు తమవైపు వాదించడానికే కాదు... వాదించకుండా ఉండటానికీ జగన్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చిస్తోందని రఘురామ విమర్శించారు. న్యాయపరమైన విషయాల్లో సీఎం జగన్‌కు సలహాలు ఇచ్చేవారు లేరనుకుంటానని, ముఖ్యమంత్రి అనవసరంగా పడి ఉన్న సలహాలదారులును తప్పించి... న్యాయసలహాదారులను పెట్టుకుంటే మంచిదని రఘురామకృష్ణరాజు సూచించారు.
 
ఈ భూమ్మీద ఎక్కడా లేని చిత్రవిచిత్ర బ్రాండ్లన్నీ ఏపీలోనే అమ్ముతున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీని లీజుకు తీసుకుని... ఈ విధంగా ఎవరు చేస్తున్నారో తెలియడంలేదన్నారు. ఇలాంటి బ్రాండ్లు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆ బ్రాండ్లేంటో.. ఆ మందేంటో అర్థం కావడం లేదని రఘురామ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాపై 139 మంది అత్యాచారం చేశారు, తెలంగాణ యువతి ఫిర్యాదులో సినిమావాళ్లు, పొలిటీషియన్స్