Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధర్మార్థ కామ డెత్, ఇప్పుడు సెక్స్ అంటే ఓ బూతు: పూరీ జగన్నాథ్

ధర్మార్థ కామ డెత్, ఇప్పుడు సెక్స్ అంటే ఓ బూతు: పూరీ జగన్నాథ్
, సోమవారం, 24 ఆగస్టు 2020 (22:14 IST)
పూరీ జగన్నాథ్ ఈమధ్య కాలంలో వదులుతున్న వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. జీవిత అనుభవాలు కావచ్చు లేదంటే ఆయన చదివిన పుస్తకాల సారాంశం కావచ్చూ... ఏదయితేనేం వీడియోల్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడివి సూపర్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన వదిలిన మరో వీడియో శృంగారం పైన.
 
ఖజరహోలో దేవాలయాలపై వున్న శృంగారం శిల్పాలను బట్టి మన పెద్దలు సెక్స్ అంటే ఏంటో, శృంగారంలో ఎన్ని భంగిమలు వున్నాయో చెప్పకనే చెప్పారని వెల్లడించారు. ఆ భంగిమలను ఎప్పుడైనా చూస్తే... అరెరే వీటిని చేయలేదే అనుకుంటూ వుంటారు. ఆ లెక్కకి వస్తే వాళ్లతో పోల్చుకుంటే మనం చేస్తున్న సెక్స్ నిల్. ఐతే ఈ కాలంలో సెక్స్ అనే పేరు ఎత్తితేనే అదో బూతులా చూస్తుంటారు. ఆనాడు పెద్దలు ఏకంగా గుడిపై శిల్పాలు చెక్కించే స్థాయిలో వుంటే ఈనాడు ఆ మాటను కూడా చెప్పలేని స్థితిలో మనం వున్నాం.
 
ధర్మార్థకామమోక్ష అనే వాక్యంలో మనం ధర్మార్థకామ వద్దే ఆగిపోతున్నాం. ఎందుకంటే ధర్మం, కామం తీర్చుకునే మోక్షం దగ్గరకి వచ్చేలోపే అవుటయిపోతున్నాం. గుడి మీద శృంగార బొమ్మలు ఏం చెబుతున్నాయంటే, నీ కామ వాంఛలు ఎన్నుంటాయో అన్నీ తీర్చుకొని అప్పుడు గుడిలోకి రా.. అప్పుడే మోక్షం. అన్ని కోరికలు తీర్చుకున్నాక సెక్స్ చేయడం మానేయాలీ అని. దమ్ముంటే గుప్పెడు బియ్యం ఉడకబెట్టి తినే వయసులో అది మానేయాలి. అప్పటి నుంచి మీ ఎనర్జీని మీ కెరీర్‌పై పెట్టండి. ఎక్కడికో వెళతారు. అదే మోక్షం. ఒంట్లో శక్తి ఉండగానే కామాన్ని మైండ్ లోంచి తీసేయాలి.
 
అదిసరే... అప్పుడు మన పెద్దలు చెక్కినట్లు దేవాలయాలపై మనం అలాంటి ఒక్క బొమ్మ చెక్కగలుగుతామా? బాబోయ్ పెద్ద గొడవలై పోతాయి. ఎందుకో తెలుసా... ఇప్పుడు సెక్స్ అంటే ఓ బూతు. ఆనాడెప్పుడో సెక్స్ లిబరేషన్ గురించి వాళ్ళు విచ్చలవిడిగా మాట్లాడటమే కాదు ఏకంగా శిల్పాలు చెక్కించి పెడితే ఇప్పుడు మనకు సెక్స్ అనే పదం పలకాలన్నా భయపడి చస్తున్నాం. అందుకే మన ఇండియాలో ఎవ్వరికీ మోక్షం రాదు. మధ్యలోనే పోతారు. ధర్మార్థ కామ డెత్ అని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్. మరి తదుపరి ఏ సబ్జెక్టుపైన మాట్లాడుతారో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆకాశ్ పూరీకి ఆంటీగా సిమ్రాన్?