Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోపిదేవి వెంకటరమణకు వైకాపా ఎమ్మెల్సీ టిక్కెట్

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (15:21 IST)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వైకాపా అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్‌ ఇక్బాల్‌, కర్నూలు జిల్లా సీనియర్‌ ​నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఖరారు చేశారు. ఈమేరకు సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. 
 
ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. చల్లా ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే మూడు స్థానాలూ వైఎస్సార్‌సీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఉప ఎన్నికల ఓటింగ్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. 
 
కాగా, టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యా బలం లేకపోవడంతో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. కావున ముగ్గురూ ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం లాంఛనమే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments