మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తాడిపత్రి మండలం తలారి చెరువులో సోలార్ ప్రాజెక్టులో పని చేస్తూ వచ్చిన అనేక టీడీపీ కార్యకర్తలను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.
ఇదే విషయంపై కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నించేందుకు ఆయన శుక్రవారం తన అనుచరగణంతో వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నాురు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోలార్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా, వారు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి, అన్యాయాలపై ఈ సందర్భంగా స్థానికులు జేసీ ప్రభాకర్ రెడ్డిని నిలదీశారు.