Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్తం పీల్చేంత అవినీతి జలగలు మీరే : నారా లోకేశ్ ట్వీట్

Advertiesment
రక్తం పీల్చేంత అవినీతి జలగలు మీరే : నారా లోకేశ్ ట్వీట్
, మంగళవారం, 30 జులై 2019 (15:02 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు ట్విట్టర్‌లో వైకాపా నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైకాపా నేతలను, వారి అవినీతిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మంగళవారం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"పేదలకు తక్కువ ధరకే బ్రాడ్ బ్యాండ్, ఫోన్, కేబుల్ ఇస్తే, వైసీపీ వాళ్ళ ఏడుపు దేనికో అర్థం కావటం లేదు. అప్పట్లో తెదేపా ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ మొదలు పెట్టిన రెండో రోజే కేబుళ్ళు కట్ చేశారు. కోర్టుల్లో కేసులు వేసి ఆపేయించాలని కుట్రలుపన్నారు. 
 
అప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి తెదేపాకు ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుందన్న ఏడుపు ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అవే మాటలు, అవే ఆరోపణలు చేస్తుంటే, వింటున్న ప్రజలకు మీ మీద రోత పుడుతోంది బుగ్గనగారూ. 
 
ఏపి ఫైబర్ గ్రిడ్ వ్యవస్థతో మేము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెచ్చుకున్నారు. రూ.5 వేల కోట్లు పట్టే ప్రాజెక్టును రూ.350 కోట్లతో పూర్తి చేసిన ఘనత మాది. అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నిరూపించండి. 
 
రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు. ఆయన్ను పక్కన ఉంచుకుని మా మీద ఆరోపణలు చేస్తే జనం నవ్వుతారు. మీ నేతలా ప్రజల రక్తం పీల్చే దుస్థితిలో నేను లేను... ఆధారాలు చూపించకుండా ఆరోపణలతో బ్రతికేస్తాం అంటే మీ ఇష్టం". 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిరుద్యోగులకు శుభవార్త... కేటగిరీ ఉద్యోగాల వివరాలు వెల్లడి