Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నేతన్న నేస్తం : 10 నుంచి మూడో దఫా సాయం

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులను ఆదుకునేందుకు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే ‘నేతన్న నేస్తం’ మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. 
 
ఈ నెల 10న ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు రూ.24 వేలు ఇస్తారు. పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
 
కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్‌ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. 
 
సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments