Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే ప్రయాణీకుల కోసం.. ఆగస్టు 7 నుంచి పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు

Advertiesment
రైల్వే ప్రయాణీకుల కోసం.. ఆగస్టు 7 నుంచి పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
, శనివారం, 7 ఆగస్టు 2021 (10:00 IST)
ఏపీలో కొన్ని రైలు సేవలు రద్దు అయ్యాయి. ఉప్పులూరు-విజయవాడ రైల్వే డబ్లింగ్‌ పనులు చివరిదశకు చేరుకోవడంతో ఆ మార్గంలో ఫ్రీఎన్‌ఐ, మెయిన్‌ ఎన్‌ఐ పనులు జరుగుతున్న దృష్ట్యా ఆగస్టు 7 నుంచి 14వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేస్తున్నట్లు స్టేషన్‌ మే నేజర్‌ పొట్లూరి మోహన్‌గాంధీ శుక్రవారం తెలిపారు.

ఈ నెల 13, 14 తేదీల్లో మచిలీపట్నం-బీదర్, బీదర్‌-మచిలీపట్నం, నర్సాపూర్‌-ధర్మవరం, ధర్మవరం-నర్సాపూర్, 12, 13 తేదీల్లో కాకినాడ-లింగంపల్లి, లింగంపల్లి-కాకినాడ రైళ్లు రద్దు అవుతాయి.
 
అదే తేదీల్లో సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ తెనాలి వరకు, నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లు విజయవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్‌ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లు 13, 14 తేదీల్లో ఏలూరు, నిడదవోలు మీదుగా దారి మళ్లింపు జరుగుతుందని, మచిలీపట్నం-విజయవాడ, నర్సాపూర్‌-గుంటూరు పాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దవుతాయని ఆయన తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీ ట్వీట్‌ను తొలగించిన ట్విట్టర్ ఇండియా