Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారదా పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకున్న జగన్... ఆశా వర్కర్లు ధన్యవాదాలు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (15:33 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్టణంలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. 
 
ముఖ్యమంత్రి హోదాలో మంగళవారం తొలిసారి వైజాక్‌కు వెళ్లిన జగన్‌కి వైకాపా నేతలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విశాఖ‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. త‌న కోసం వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చినముషిడివాడలోని శారద పీఠానికి వెళ్లారు.
 
అక్కడ సంప్ర‌దాయ వ‌స్త్రాలు ధ‌రించిన జ‌గ‌న్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అంత‌కుముందు జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 2017లో పాదయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్‌ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న విష‌యం తెలిసిందే.
 
ఈ సందర్భంగా పలువురు ఆశా వర్కర్లు సీఎం జగన్‌ను కలిసి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తమ వేతనాలను పెంచి ఆదుకున్నందుకుగాను వారంతా జగన్‌కు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments