Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ ‘గ్రామసింహాలు’ అరవడం సహజమే: పవన్‌

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (07:22 IST)
పవన్‌ తోలు తీస్తాం. ఆయన సన్నాసిన్నర’ అంటూ విరుచుకుపడిన మంత్రులకు... సోషల్‌ మీడియాలో ధ్వజమెత్తుతున్న వైసీపీ అభిమానులకు జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

వైసీపీ ‘గ్రామసింహాలు’ ఇలా అరవడం సహజమే అన్నారు. ‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. ఇవన్నీ సహజమే’ అని వ్యాఖ్యానించారు.
 
అక్టోబర్ 2వ తేదీన పవన్ రెండు ప్రాంతాల్లో శ్రమదానం
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేస్తారు. ఛిద్రమైన రహదారులకు మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.

ఆ రోజు ఉదయం 10గంటలకు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై దెబ్బ తిన్న రహదారికి మరమ్మతులు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 2018లో పవన్ ఈ రోడ్డుపైనే పోరాట యాత్రలో భాగంగా కవాతు నిర్వహించారు. 

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లాలో చేపట్టే కార్యక్రమానికి హాజరవుతారు. కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి – ధర్మవరం రోడ్డుకు శ్రమదానం ద్వారా మరమ్మతులు చేపడతారు.

రాష్ట్రంలో ఛిద్రమైన రహదారుల గురించి జనసేన పార్టీ ఈ నెల 2, 3, 4 తేదీల్లో సామాజిక మాధ్యమాలు వేదికగా ఉద్యమించిన సంగతి విదితమే.

నాలుగు వారాలు గడువు ఇచ్చి వాటికి కనీసం మరమ్మతులైనా చేయాలని విజ్ఞప్తి చేసి... ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రహదారికి జనసేన శ్రేణులు మరమ్మతులు చేస్తాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికీ రహదారుల విషయంలో అలక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో శ్రమదానం ద్వారా జనసేన శ్రేణులు రహదారులకు మరమ్మతులు చేపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments