Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించి పెళ్లాడి... భ‌ర్త చేతిలో మోసపోయి... ఓ త‌ల్లి దీన‌గాధ ఇది!

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (12:22 IST)
ఈమె పేరు కస్తూరి మాధవి. ఊరు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు. ఆర్.టీ.ఓ ఆఫీస్ వద్ద రోడ్డు మీద చిన్న గుడిసెలో నివాసం ఉంటోంది. ప్రేమ పేరుతో మోసం చేసి ఓ అబ్బాయి ఈమెతో ముగ్గురు పిల్లల్ని కన్నాడు. మొదటి కాన్పులో ఒక బాబు, రెండవ కాన్పులో ఇద్దరు కవలలు పుట్టారు. ఇక మోజు తీరిన భర్త ఈమెను, పిల్లల్ని వదిలి అనాధ‌లను చేసి ఇల్లు వదిలి పారిపోయాడు. ఈ విషయం స్థానిక పోలీసులకు క‌స్తూరి ఫిర్యాదు చేసింది. కానీ, పోలీసులు ఎవరూ ఆమె విషయం పట్టించుకోలేదు. నేను అణగారిన వర్గానికి చెందిన చాలా పేద అమ్మాయిని, నాకు దిక్కెవ‌రు అని క‌స్తూరి రోధిస్తోంది.
 
 
ఇప్పుడు నా బిడ్డలకు నా ద్వారా తల్లి పాలు సమస్య ఏర్పడింది. వారి పోషణకు నా ఆర్ధిక సమస్య పెద్ద కారణం అయ్యింది. నన్ను ఆదరించే వారు ఎవరూ లేరు. ఉన్నరోజు, లేనిరోజు అని చూడకుండా నా పసి బిడ్డలకు పాల కోసం నేను ఎన్నో కష్టాలు పడుతున్నాను.కేవలం పిల్లల సంరక్షణ  కోసం మంగళగిరిలో చాలా చిన్న జీతానికి బట్టల షాపులో పని చేస్తున్నాను. 3 నెలల పసికందులను ఇంటిలో వదిలి ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు షాపులో పనిచేయడం కూడా చాలా కష్టంగా ఉంది. 
 
 
మా అమ్మ నాకు తోడుండటంతో ఆ పని అయినా చేసుకోగలుగుతున్నాను. నా పసి బిడ్డల ఆకలి ఏడుపులు నన్ను చాలా భాధిస్తున్నాయి. నా పెద్ద బాబు వచ్చి రాని మాటలతో నోటి వద్ద చేయి పెట్టి తింటా, తింటా అని చేయి ఊపుతుంటే వారికి సరియైన ఆహారం అందించలేని స్థితిలో ఉన్న నాకు, మా అమ్మకు ప్రాణం చచ్చిపోతుంది. అన్నల్లారా, అక్కల్లారా,నేను మిమ్మల్ని ఏ విధమైన పెద్ద సాయం కోరడం లేదు. పసిబిడ్డల ఆకలి తీర్చేందుకు వారికి అవసరం అయిన పాల డబ్బాల ఖర్చు సాయమే మీరు  నాకు ఇచ్చే కొండంత ధైర్యం నా పిల్లలకు ఆసరా. దయచేసి నాకు ఆర్ధిక సాయం అందించండని వేడుకుంటోంది క‌స్తూరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments