అమరావతితోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లి వాసులకిది దశాబ్దాల కల. దానిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి నెరవేరుస్తున్నారు. తాడేపల్లి గుంటూరు ఛానల్ కట్టకు రోడ్డు వేస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని స్థానికులు భుజానికి ఎత్తుకుంటున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా గుంటూరు ఛానల్ కట్ట దారిపైన ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు వేలాదిగా ఉన్నాయి. ఉండవల్లి పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడల్లా కట్ట మీద రోడ్డు వేస్తామని రాజకీయ పార్టీలు హామీలు గుప్పించాయి, తప్ప రోడ్డు నిర్మాణం చేపట్టలేదని స్థానికులు చెపుతున్నారు.
వర్షాకాలం వస్తే, ఇక ఈ దారి గుండా ప్రయాణం నరకయాతనగా ఉండేది. ఇపుడు ఆ కట్టపైరోడ్డ నిర్మాణం చేయిస్తున్న ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని స్థానికులు తమ పాలిట దేవుడిలా భావిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం చేపట్టటం సంతోషంగా ఉందని, జీవిత కాలం ఆయన చేసిన మేలు మరిచిపోకుండా ఉంటామని స్థానికులు చెపుతున్నారు.