Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలింత ప్రాణం తీసిన కోతులు.. ఎక్కడ ఎలా?

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (06:44 IST)
కోతులు ఆంజనేయస్వామికి ప్రతిరూపాలుగా భావిస్తారు. అందుకే అవి ఇళ్లలోకి వచ్చినా వాటిని కొట్టరు. అలాంటి కోతులు ఓ బాలింత ప్రాణాలు తీశాయి. ఈ కోతుల గుంపు ఆగడాలకు పండండి బిడ్డ జన్మనిచ్చిన ఓ బాలింత కన్నుమూసింది. ఈ విషాద దుర్ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో కుక్కడం గ్రామానికి చెందిన దోమల శ్రీలత(23) మంగళవారం కోతుల గుంపు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో వారంతా పనికి వెళ్లారు. శ్రీలత ఇటీవలనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
తన బిడ్డతో ఆమె ఇంట్లోనే ఉండగా.. 9 గంటల సమయంలో కోతుల గుంపు ఇంట్లోకి ప్రవేశించాయి. తన బిడ్డ మీద కోతులు దాడి చేస్తాయని భయపడిన ఆమె.. వాటిని తరిమె ప్రయత్నం చేసింది. వెంటనే వానరమూక ఆమెపై మూకుమ్మడిగా దాడి చేయడంతో గడపపై పడి అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. బాలింత మృతితో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. శ్రీలతకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
 
కాగా గ్రామం నుంచి కోతులను తరిమేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పలుమార్లు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలని ప్రశ్నిస్తున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments