Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రియుడిపై మోజు : కట్టుకున్నోడి హత్యకు భార్య సుపారి!

Advertiesment
Guntur
, ఆదివారం, 29 నవంబరు 2020 (09:06 IST)
ఇటీవలికాలంలో వివాహేతర హత్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి హత్య కేసుల్లో కీలక సూత్రధారులుగా భార్యలే ఉంటున్నారు. తాజాగా ప్రియుడిపై మోజుపడిన ఓ వివాహిత... కట్టుకున్నోడిని హత్య చేసేందుకు ఏకంగా రూ.10 లక్షల సుపారీ ఇచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని పెదకూరపాడు పోలీస్ట్ స్టేషన్ పరిధిలోని 75 త్యాళ్ళూరులో ధరణికోటకు చెందిన సాయికుమారికి వివాహమైంది. వారికి బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న కూతురు, బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు ఉన్నారు. వీరు ఓ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. 
 
వీరి హోటల్‌కు ఎదురుగా.. అదే గ్రామానికి చెందిన మూడెల అశోక్‌రెడ్డి కూల్‌డ్రింక్‌ షాపు నిర్వహిస్తుంటాడు. ఆయనకు ఏడాది క్రితమే వివాహమైంది. అయితే చాలాకాలం నుంచి అశోక్‌రెడ్డికి, సాయికుమారికి మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి పద్ధతి మానుకోవాలని బ్రహ్మయ్య మందలించాడు. కానీ భార్య తీరులో ఏమాత్రం మార్పులేదు. 
 
ఈ క్రమంలో తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఎలాగైనా ఆయనను అడ్డు తొలగించుకోవాలని అశోక్‌రెడ్డి, సాయికుమారి ఏడాది క్రితం నిర్ణయించుకున్నారు. చేతికి మట్టి అంటకుండా భర్తను చంపాలని ప్రియుడిని కోరింది. దీంతో అశోక్‌రెడ్డి తనకు పరిచయమున్న కారు డ్రైవర్‌ భరత్‌ రెడ్డితో కలసి కిరాయి హంతకులను సంప్రదించాడు. భరత్‌రెడ్డి, పవన్‌ కుమార్‌, షరీఫ్‌లు కలిసి ఈ హత్యకు పథకం పన్నారు. హత్యకు రూ.10 లక్షలు సుపారీ మాట్లాడుకున్నారు.
 
తమ పథకంలో భాగంగా ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన బ్రహ్మయ్యను హత్య చేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో బ్రహ్మయ్య హత్య కేసులో భార్య సాయి కుమారి(35), ఆమె ప్రియుడు మూడెల అశోక్‌రెడ్డి(24)తో పాటు కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన కారు డ్రైవర్‌ పవన్‌కుమార్‌, తాపీమేస్త్రీ షేక్‌ షరీఫ్‌ల పాత్ర ఉన్నట్టు గుర్తించి, అరెస్టు చేశారు. వీరిలో కారు డ్రైవర్‌ భార్గవరెడ్డి పరారీలో ఉన్నాడు. దీంతో ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయలసీమ ప్రజలను హెచ్చరించిన రోజా.. డిసెంబర్ 2వ తేదీ..?