Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ ఆస్పత్రిలో మహిళ మృతి, ఐదు తులాల బంగార ఆభరణాలు మాయం

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:53 IST)
కరోనా చికిత్స పొందుతూ ఓ మహిళ మరణించింది. ఆమె శరీరంపై ఉన్న 5 తులాల బంగార ఆభరణాలు మాయమైన ఘటన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలంలో జరిగింది. మండలం లోని ఓ గ్రామానికి చెందిన మహిళ కరోనా బారిన పడి నెల్లిమర్లలోని మిమ్స్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ చికిత్స  పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు.
 
ఈ క్రమంలో మృతదేహంపై కప్పిన కవర్‌ను తొలగించి చూడగా, ఆమె శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వారు ఆందోళనకు దిగారు. బాధిత మహిళ బంధువుల ఆరోపణలపై జిల్లా కోవిడ్ ఆస్పత్రి ప్రత్యేక వైద్యాధికారి హరికిషన్ సుబ్రమణ్యం స్పందించారు. ఆస్పత్రిలో మృతురాలి బంగారు నగలు పోయేందుకు అవకాశం లేదని, అన్ని గదుల్లోను సీసీ కెమరాలు ఉన్నాయని తెలిపారు.
 
నిజానికి కరోనా భయంతో ఎవరు దగ్గరికి వెళ్లే పరిస్థితి కూడా లేదని తెలిపారు. మృతదేహాన్ని బంధువులు తరలించే సమయంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని నెల్లిమర్ల పోలీసులు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments