Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలను ప్రతిఘటించిన వీర వనిత.. కత్తితో పొడిచినా వెనక్కి తగ్గలేదు..

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (10:27 IST)
విశాఖ జిల్లాలో దొంగలు పడ్డారు. అయితే ఓ ధీర వనిత దొంగలను ప్రతిఘటించింది. వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తిలోని చీమలపల్లిలో ఉన్న చెరువుగట్టు ప్రాంతంలో ఆళ్ల అప్పారావు అనే కుటుంబం నివసిస్తోంది. ఆయన తన భార్య లలితకుమారి, ఇద్దరు కుమారులు కలిసి ఉంటున్నారు. 
 
ఆయన కుమార్లో ఒకరైన అవినాష్‌కు ఇటీవల లావణ్యతో వివాహం అయ్యింది. మంగళవారం రాత్రి ఎప్పట్లాగే అవినాష్ విధులకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఓ గదిలో ఉండగా.. మరొక గదిలో లావణ్య ఒక్కతే నిద్రిస్తోంది.
 
కట్ చేస్తే.. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో, నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చారు. ఇంటి కిటికీ గ్రిల్‌ను తొలగించి.. లోపలికి ప్రవేశించారు. 
 
లావణ్య గది తలుపుని బద్దలుకొట్టి.. లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ శబ్ధానికి లావణ్య నిద్ర లేచింది. లావణ్య నిద్రలేచిన విషయం గమనించిన దుండగులు.. ఆమెని బంధించేందుకు ప్రయత్నించారు. కానీ.. లావణ్య వారికి దొరక్కుండా తీవ్రంగా ప్రతిఘటించింది. 
 
గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో వాళ్లు ఆమెపై కత్తితో దాడి చేశారు. అయినా లెక్క చేయకుండా.. వారిని ఎదుర్కొని, గదిలో నుంచి బయటకు వచ్చి, గట్టిగా కేకలు వేసింది. 
 
అత్త, మామ, బావ పడుకున్న గదికి గడియ వేయడంతో.. వాళ్లు బయటకు రాలేకపోయారు. అయితే.. లావణ్య అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే ఆ దుండగులు పారిపోయారు.
 
తీవ్ర గాయాలపాలైన లావణ్యను.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments