Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబరు 11న ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ

Advertiesment
modi - jagan
, బుధవారం, 26 అక్టోబరు 2022 (12:29 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. విశాఖపట్టణం విమానాశ్రయాన్ని మరింతగా అభివృద్ధి, విస్తరణ, ఆధునకీకరణ పనులకు శుంకుస్థాపన చేసేందుకు ఆయన స్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 
 
నవంబరు 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖకు వస్తున్నట్టు ఏపీ ప్రభుత్వానికి పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఈ సందర్భంగా రూ.400 కోట్లతో చేపట్టనున్న విశాఖ రైల్వే స్టేషన్ ఆధునకీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. 
 
అలాగే, అదే రోజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత నగరంలో జరుగనున్న భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 
 
కాగా, ప్రధాని ఏపీ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ తదితరులు పాల్గొంటారు. ప్రధాన రాక నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లుపై కలెక్టర్ ఇతర అధికారులు ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు. 
 
మరోవైపు, నవంబరు 4వ తేదీన వైజాగ్‌లోని తూర్పు నౌకాదళంలో జరుగనున్న నౌకా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఖర్గే