Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవరుతో అక్రమ సంబంధం.. భర్త, తమ్ముడికి తెలియడంతో...

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (20:48 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని తీసుకుంది. భర్త ఎప్పుడూ పనుల నిమిత్తం తిరగడంతో కోర్కెను చంపుకోలేక ఒక వివాహిత ఏకంగా డ్రైవర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది కాస్త సంవత్సరం వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ చివరకు భర్తతో పాటు సొంత తమ్ముడికి వ్యవహారం తెలిసిపోయింది.
 
కర్నూలు జిల్లా సున్నిపెంట గ్రామంలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అరవింద్‌కు, రాణికి సంవత్సరన్నర క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. చుట్టుప్రక్కల జిల్లాలో స్థలాలను విక్రయిస్తూ అరవింద్ బాగానే సంపాదించాడు. ఆర్థికంగా వీరి కుటుంబం నిలదొక్కుకుంది. 
 
అరవింద్ ఇంట్లో కారు డ్రైవర్‌గా చేరాడు నాగభూషణం. భర్త ఎప్పుడూ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం బయట తిరుగుతుండటంతో రాణి, నాగభూషణంకు దగ్గరైంది. వీరి వ్యవహారం కాస్త సంవత్సరం వరకు బాగానే సాగింది. అయితే రాణి తమ్ముడు నిఖిల్ డిగ్రీ పూర్తి చేసుకుని అక్క ఇంట్లో కొన్ని రోజులు ఉండేందుకు వచ్చాడు. రాణి, నాగభూషణంల వ్యవహారం నిఖిల్‌కు తెలిసిపోయింది. అక్కను ఏమీ అనలేక విషయాన్ని బావకు చెప్పాడు.
 
దీంతో నిఖిల్‌ను వెంటపెట్టుకుని వెళ్ళిన అరవింద్ అతనికి పూటుగా మద్యం పోశాడు. నాగభూషణంను చంపేస్తే మీ అక్కతో కాపురం చేస్తా.. లేకుంటే మిమ్మల్ని రోడ్డుకు లాగుతానంటూ బెదిరించాడు. అక్క కాపురాన్ని నిలబెట్టడానికి నాగభూషణంను శ్రీశైలం ప్రాజెక్టుకు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి చంపేశాడు నిఖిల్. వారం రోజుల క్రితం ఘటన జరిగితే పోలీసులు నిందితుల కోసం గాలించారు. అయితే పోస్టుమార్టంలో నిఖిల్ వేలిముద్రలు సరిపోవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments