Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 11 February 2025
webdunia

ప్రియుడి కోసం బిర్యానీలో విషం కలిపి భర్తకు పెట్టిన భార్య

Advertiesment
ప్రియుడి కోసం బిర్యానీలో విషం కలిపి భర్తకు పెట్టిన భార్య
, శనివారం, 4 జనవరి 2020 (20:48 IST)
భార్యాభర్తల మధ్య సంబంధం అన్యోన్యంగా ఉండాలని పెద్దలు ఎంతో ఆలోచించి చేస్తున్న పెళ్లిళ్లు కూడా నేటి సమాజంలో నీరుగారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజురోజుకు మానవ సంబంధాలు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయి. తమ వివాహేతర బంధానికి అడ్డంగా ఉన్నాడని కట్టుకున్న భర్తకు బిర్యానీలో విషం కలిపి పెట్టిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
వేలూరు జిల్లాకు చెందిన జోలార్ పేట గ్రామంలో గణేష్ అతడి భార్య జయ వారి కుమార్తెతో కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గణేష్ భార్య అదే గ్రామానికి చెందిన ఒక స్కూల్ టీచర్‌తో చనువుగా ఉండటం ప్రారంభించింది. భర్త గణేష్ ఉద్యోగరీత్యా హోసూరులో నివాసముంటున్నాడు. ఇదే అదునుగా భావించిన జయ స్కూలు టీచర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. అది కాస్తా ముదిరి అతడితో వివాహేతర బంధానికి దారి తీసింది. ఇద్దరూ శారీరకంగా కలవడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గమనించిన బాధితుడి సన్నిహితులు ఆమె నడవడికపై అతడి దృష్టికి తీసుకెళ్ళారు. 
 
దీంతో గణేష్ తన భార్యపై ఒక కన్నేసి ఉంచాడు. ఒకరోజు స్కూల్ టీచర్‌తో కలిసి ఆమె కలిసి ఉన్న సమయంలో గణేష్‌ను చూసి నిలదీశాడు. అప్పటి నుంచి ఆమె స్కూల్ టీచర్‌ను దూరం పెడుతూ వచ్చింది. అయితే కొంతకాలం గడిచిన తర్వాత జయ స్కూల్ టీచర్‌ను విడిచి ఉండలేకపోయింది. 
 
ఎలాగైన భర్తను కడతేర్చి ప్రియుడితో జతకట్టాలని పథకం పన్నింది. ఒకరోజు జయ బిర్యానీ వండి, అందులో విషం కలిపింది. భర్తతో తాను మారిపోయానని నమ్మించి కుటిల పన్నాగం పన్ని, అతనికి బిర్యానీ వడ్డించింది. బిర్యానీ తిన్న గణేష్ వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. 
 
ఇదే అదనుగా భావించిన జయ ఇంటికి తాళం వేసి పరారైంది. అయితే అదే సమయంలో గణేష్ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి కిటికీ లోంచి చూడగా, గణేష్ అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితురాలు జయ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్కడ భార్యలను ఎత్తుకెళ్ళి మరీ కాపురం చేస్తారు, అది ఆచారం, ఎక్కడ?