Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కడ భార్యలను ఎత్తుకెళ్ళి మరీ కాపురం చేస్తారు, అది ఆచారం, ఎక్కడ?

Advertiesment
Wives
, శనివారం, 4 జనవరి 2020 (18:52 IST)
ఇండియాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు వివాహ బంధానికి విలువనిస్తాయి. కానీ, కొన్ని దేశాల్లో.. భార్యాభర్తల బంధాలు శాశ్వతంగా ఉండవు. కొన్నాళ్లు సహజీవనం చేసిన తర్వాత.. ఆమె లేదా అతడికి నచ్చితేనే ఆ బంధం పెళ్లి వరకు వెళుతుంది. లేకపోతే ఎవరి దారి వారిదే. ఇంకొన్ని దేశాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. కానీ, ఆ బంధాలు మాత్రం శాశ్వతంగా ఉండవు. అక్కడి సాంప్రదాయాల ప్రకారం.. ఒకరి భార్యను మరొకరు ఎత్తుకుపోతారు. ఇంకో దేశంలో భార్యలను పరస్పరం మార్చుకుంటారు.
 
ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలోని ఆర్కిటిక్‌ ప్రాంతంలో నివసించే ప్రజలు వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అక్కడ ఒకరి భార్యను మరొకరితో పంచుకుంటారు. ఇలా భార్యలను మార్చుకోవడం వెనుక బలమైన కారణం ఉందని అక్కడివాళ్లు చెబుతారు. ఎందుకు మార్చుకుంటారు.
 
ఆర్కిటిక్ ఉష్ణోగ్రతలు భిన్నంగా ఉంటాయి. అక్కడ నిత్యం మంచు తుఫాన్లు, వరదలు తదితర విపత్తులు సంభవిస్తాయి. దుష్టశక్తుల వల్లే ఈ విపత్తులు ఏర్పడతాయని అక్కడి ప్రజలు భావిస్తారు. భార్యలను మార్చుకోవడం ద్వారా ఆ దుష్టశక్తులు గందరగోళానికి గురవుతాయని, విపత్తులు రావని నమ్ముతారు.
 
సైబీరియా ఎస్కిమోలు మహిళల రుతుస్రావాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఆ మూడు రోజులు.. ఆమెను కలుషిత మహిళగా భావిస్తారు. రుతుస్రావంతో ఉన్న మహిళతో శృంగారం చేసే వ్యక్తి సముద్రంలో మునిగి చనిపోతాడని నమ్ముతారు. ఇతరుల భార్యలను ఎత్తుకుపోయే సాంప్రదాయం పశ్చిమ ఆఫ్రికాలో వుంది. అక్కడ నివసించే నిగర్ తెగ ఆదివాసీలు.. పెద్దలు చేసే పెళ్లికి కట్టుబడి ఉండరు. 
 
అక్కడ ఏటా నిర్వహించే గెరేవాల్ ఫెస్టివల్‌లో.. పురుషులు తమ మర్మాంగాలు కనిపించేలా వింతైన మేకప్, దుస్తులు ధరించి మహిళలను ఆకట్టుకుంటారు. అందులో ఎవరైనా కొత్తగా పెళ్లయిన యువతులు ఉంటే.. వారిని ఎత్తుకెళ్లిపోతారు. అలా ఎత్తుకెళ్ళిన వ్యక్తికి ఆమె మళ్లీ భార్య అవుతుంది. అక్కడి సమాజం కూడా వారిని గుర్తిస్తుంది. అయితే, ఈ సాంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారనేది ఇప్పటికీ అంతుబట్టడంలేదు.
 
సాంప్రదాయాలు.. మూఢ నమ్మకాలతో పాటిస్తున్నవే. అయితే, అక్కడ విచ్చలవిడి శృంగారానికి అవకాశం లేదు. పెద్దల సమక్షంలోనే అవన్నీ పద్ధతిగా జరుగుతాయి. ఆ తర్వాత వారి బంధాన్ని స్థానికులు గౌరవిస్తారు. కానీ, వివిధ దేశాల్లో భార్యలను మార్చుకొనే విధానాన్ని శృంగార అవసరాల కోసం పాటిస్తున్నారు. స్నేహితుడు లేదా సహ ఉద్యోగి భార్య నచ్చినట్లయితే.. పరస్పర అంగీకరంతో వారి భార్యలను పంచుకుంటున్నారు. ఇది మన దేశంలో కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోందనే సమాచారం ఉంది.
 
పెళ్లి తర్వాత పరాయి మహిళ, లేదా పురుషుడు.. ఇతరులపై మోజుపడటాన్ని సమాజం తప్పుగా భావిస్తోంది. అలా చేయడం వల్ల భార్యభర్తల మధ్య స్పర్థలు కూడా తలెత్తుతాయి. భర్త ఒక్కడే వేరే యువతితో శృంగారంలో పాల్గొంటే.. భార్యను అన్యాయం చేసినట్లవుతుంది. అదే భార్య కూడా తనకు ఇష్టమైన ఇంకో వ్యక్తితో ఆ సుఖాన్ని పంచుకుంటే.. ఆ ఇద్దరిలో తప్పు చేశామనే భావనే ఉండదని నమ్ముతారు. దాని ఫలితంగానే ఇటీవల ఈ ట్రెండ్ విచ్చలవిడిగా సాగుతోంది.
 
శృంగార అవసరాల కోసం అప్పటికప్పుడు భార్యలను మార్చుకున్నా, అది అక్కడితో ఆగిపోదనే సంగతి తెలిసిందే. భవిష్యత్తులో అది ప్రమాదకరం కావచ్చు. పరాయి భార్య లేదా భర్తపై మోజు పెరిగితే.. అది విచ్చలవిడి శృంగారానికి దారితీస్తుంది. భర్తపై భార్యకు, భార్యపై భర్తకు గౌరవం పోతుంది. అది విడాకులకు దారితీయవచ్చు. పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. కాబట్టి, ఇలాంటి సాంప్రదాయాలు లేదా పద్ధతులకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెపుతున్నారు. కొన్ని వినడానికి బాగానే ఉంటాయి. కానీ, అవి భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదనేది అందరికీ తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీ