Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు సంపాదన కోసమే జగన్‌ వైన్ షాపులు: టీడీపీ

Webdunia
బుధవారం, 13 మే 2020 (07:42 IST)
డబ్బు సంపాదన కోసమే జగన్‌ వైన్ షాపులు తెరిచారని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

మద్యం అమ్మకాలను నిషేధించడంతో 40 రోజుల పాటు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని మద్యం బ్రాండ్‌లను అమ్ముతున్నారని అన్నారు. నాసిరకం బ్రాండ్లంటే.. విషం అమ్ముతున్నట్లేనని వ్యాఖ్యానించారు.

మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులే.. క్యూలైన్లలో ప్రజలను అదుపు చేసే విధుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ డబ్బులు.. నాన్న గొంతుతడి చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులను ఘోరంగా పెంచిందని అయ్యన్న ఆరోపించారు. ఏపీలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతుంటే లాక్‌డౌన్‌ను సడలించడం సరికాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments