Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో వృద్ధురాలిని హత్య చేసిన వాలంటీర్...

Webdunia
సోమవారం, 31 జులై 2023 (15:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లు పెట్రేగిపోతున్నారు. ఇప్పటికే అత్యాచారాలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చిన వారు.. తాజాగా ఏకంగా హత్య చేశారు. విశాఖపట్టణంలో ఒక వాలంటీర్ ఏకంగా ఓ వృద్ధురాలిని చంపేశాడు. మృతురాలిని వరలక్ష్మిగా గుర్తించారు. ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బు కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
దీనిపై వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ హత్యకు ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలంతా బాధ్యులమేనని చెప్పారు. ఈ హత్యకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
వాలంటీర్లు చేస్తున్న పని ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటాను చోరీ చేయడం మినహా వారు చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. మహిళల ఫోటోలను కూడా వాలంటీర్లు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. పింఛన్‌ను వార్డు సభ్యుడు కూడా ఇవ్వొచ్చని లేదా పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయొచ్చని ఆయన సూచించారు. 
 
ఒక ఇంటి నంబరుపై 500కు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని, దొంగ ఓట్లు ఉన్న వారి పింఛన్ ఎవరి ఖాతాల్లోకి వెళుతుందని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రభుత్వం సిగ్గు లేకుండా కేసు పెట్టిందని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments