Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరు నెలలో అద్భుతం - కడప చిన్నారి నోబెల్ వరల్డ్ రికార్డు...

Kids
, సోమవారం, 31 జులై 2023 (09:24 IST)
పుట్టిన ఆరు నెలలో అద్భుత జ్ఞాపకశక్తితో ఓ చిన్నారి అదరగొట్టింది. ఫలితంగా కడప జిల్లాకు చెందిన ఓ బాలుడు నోబెల్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శాస్త్రి నగర్‌కు చెందిన పవన్ కుమార్ - సౌమ్యప్రియ అనే దంపతుల కుమారుడు వి.ప్రజ్వల్. ఆరు నెలల వయసు. ఈ బుడతడు అపుడే వివిధ రకాలైన చిత్రాలను గుర్తిస్తున్నాడు. తల్లి సౌమ్య వివిధ రకాలైన జంతువులు, పండులు, వాహనాలు, అంకెలు, పక్షులు, కూరగాయలు వంటి చిత్ర పటాలను చూపించి వాటి పేర్లను గుర్తించడం, నేర్పించారు. 
 
దీంతో ఆ చిన్నారికీ పలు బొమ్మల పేరు చూపించి, వాటి పేర్లు అడిగిన వెంటనే గుర్తిస్తున్నాడు. ఆ వీడియోలను తల్లిదండ్రులు ఈ నెల 19న నోబెల్ వరల్డ్ రికార్డ్ సంస్థకు పంపారు. ఆ సంస్థ నిర్వాహకులు వాటిని పరిశీలించి బాలుడి ప్రతిభను గుర్తించి అవార్డును ఇంటికి పంపారు. ఆరు నెలల చిన్నారికి నోబెల్ వరల్డ్ రికార్డు అవార్డును ఇచ్చారు. వీరి కుమార్తె కూడా అద్భుతంగా రాణిస్తుంది. ఇప్పటికే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, కలాం వరల్డ్ రికార్డు, నోబెల్ వరల్డ్ రికార్డు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు.. ఇలా ఇప్పటివరకు 5 అవార్డులు సాధించింది. 
 
ట్రాన్స్‌జెండర్‌గా మారిన యువకుడు మృతి... ఎలా?  
 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ విషాదకర ఘటన జరిగింది. ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఓ యువకుడు మృతి చెందాడు. రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
వంరగల్ జిల్లా సంగెం మండలం తూర్పు తండాకు చెందిన బడవాత్ భీమ్ కుమారుడు అనిల్.. అనే 24 యేళ్ల యువకుడు ట్రాన్స్‌జెండర్‌‍గా మారాడు. హైదరాబాద్ నగరంలోని హిజ్రాలతో కలిసి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట వస్తుండగా మధ్యలో వారు మనసు మార్చుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
రఘనాథపల్లి స్టేషన్ వద్ద రైలు వేగం నెమ్మదించడంతో రైలు నుంచి కిందకు దిగబోయారు. ఆ ప్రయత్నంలో దివ్య అలియాస్ అనిల్ ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో బలమై గాయాలయ్యాయి. దీంతో దివ్య ప్రాణాలు కోల్పోయింది. జనగామ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.. ఎప్పటికైనా జంప్ జిలానీనే : కేంద్ర మంత్రి రాందాస్