Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకున్న ఎస్‌బిఐ లైఫ్

image
, శనివారం, 10 జూన్ 2023 (22:10 IST)
దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ జీవిత భీమా కంపెనీలలో ఒకటైన SBI లైఫ్ ఇన్సూరెన్స్, #IndiaKaPassionPledge ప్రచారాన్ని ప్రారంభించడానికి కొత్త AI-టెక్నాలజీ, ChatGPTని ఉపయోగించుకుంది. ' మోస్ట్ ప్లెడ్జెస్ రిసీవ్డ్ ఫర్ ఏ పాషన్ కాంపెయిన్ ఇన్ 24 హావర్స్ ( 24 గంటల్లో పాషన్ ప్రచారం కోసం అత్యధిక ప్రతిజ్ఞల అందుకోవటం ) కోసం గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను సృష్టించింది. ఈ ప్రచారంలో దేశవ్యాప్తంగా ప్రజలు భాగస్వామ్యమయ్యారు, ఇక్కడ వినియోగదారులు తమ కుటుంబ ఆర్థిక అవసరాలను చూసుకుంటూ, ఏకకాలంలో తమ అభిరుచిని సైతం కొనసాగించేందుకు ఆన్‌లైన్‌లో ప్రతిజ్ఞ తీసుకున్నారు.
 
వినియోగదారులను వారి అభిరుచిని కొనసాగించేలా ప్రోత్సహించే ప్రయత్నంలో, SBI లైఫ్ AI-ప్రాంప్ట్ ప్లెడ్జిథాన్ మైక్రోసైట్‌ను ప్రారంభించింది, ఇది ఆర్థిక సేవల రంగంలో మొట్టమొదటిసారిగా వ్యక్తిగతీకరించిన ప్రతిజ్ఞలను రూపొందించడానికి ChatGPTని ఉపయోగించింది. వినియోగదారు వారి పేరు, లింగం, సంప్రదింపు నంబర్ మరియు వ్యక్తిగత అభిరుచి వంటి ప్రాథమిక సమాచారాన్ని ప్లెడ్జి జనరేషన్ ప్రాంప్ట్‌లో నమోదు చేసిన తర్వాత మైక్రోసైట్ వినియోగదారులను వ్యక్తిగతీకరించిన ప్రతిజ్ఞను రూపొందించడానికి అనుమతించింది. వినియోగదారులు తమకి అనుకూలీకరించిన ప్రతిజ్ఞను స్వీకరించారు, అది తర్వాత ఆడియో ఫైల్‌గా మార్చబడింది. బ్రాండ్ యొక్క మ్యూజికల్ లోగోతో పాటు టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ ద్వారా టెక్స్ట్ తిరిగి చదవబడింది.
 
ఈ కార్యక్రమం పై SBI లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ & సిఎస్ఆర్ చీఫ్, శ్రీ రవీంద్ర శర్మ మాట్లాడుతూ, “కొత్త సాంకేతికతల ఆగమనం నేటి వినియోగదారుల వైఖరి, ప్రవర్తనకు పునరాకృతి అందిస్తుంది. వారు మునుపటి కంటే ఎక్కువగా ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు. కొత్త-తరపు వినియోగదారుడు,  కొత్త సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు. తమ ప్రయాణంలో సైతం  డిజిటల్‌గా ఇంటరాక్ట్ కావడం  చేస్తున్నారు." అని అన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథికి గుండెపోటు