Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 12 నుండి 17 జూన్ 2023 వరకు వార్షిక మాన్‌సూన్ సర్వీస్ ఈవెంట్‌ను ప్రకటించిన జేఎల్ఆర్ ఇండియా

Advertiesment
జూన్ 12 నుండి 17 జూన్ 2023 వరకు వార్షిక మాన్‌సూన్ సర్వీస్ ఈవెంట్‌ను ప్రకటించిన జేఎల్ఆర్ ఇండియా
, శనివారం, 10 జూన్ 2023 (18:54 IST)
జెఎల్ఆర్ ఇండియా ఈ రోజు తమ వార్షిక మాన్‌సూన్ సర్వీస్ ఈవెంట్‌ను ప్రకటించింది. ఇది భారతదేశంలోని అన్ని అధీకృత రిటైలర్‌లలో 2023 జూన్ 12 నుండి 17 వరకు నిర్వహించబడుతుంది. కాంప్లిమెంటరీ వెహికల్ చెక్, బ్రాండెడ్ వస్తువులు, యాక్సెసరీలు, విలువ ఆధారిత సేవలపై ప్రత్యేకమైన ఆఫర్‌ల నుండి క్లయింట్లు ప్రయోజనం పొందవచ్చు. అన్ని వాహనాలకు అధిక శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు హాజరవుతారు. అవసరమైన చోట జేఎల్ఆర్  అసలైన విడిభాగాల హామీని అందుకుంటారు. వర్షాకాలంలో ప్రతి ప్రయాణం సురక్షితంగా, భద్రంగా ఉందని నిర్ధారించుకోవడానికి, ఈవెంట్ కాంప్లిమెంటరీ 32 - పాయింట్ ఎలక్ట్రానిక్ వెహికల్ హెల్త్ చెక్-అప్, బ్రేక్, వైపర్ చెక్, టైర్, ఫ్లూయిడ్ లెవెల్ చెక్, అలాగే సమగ్ర బ్యాటరీ ఆరోగ్య తనిఖీని అందిస్తుంది.
 
ఈ సందర్భంగా జేఎల్ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజన్ అంబ మాట్లాడుతూ, ‘‘మా మాన్‌సూన్ స ర్వీస్ ఈవెంట్ మా హౌస్ ఆఫ్ బ్రాండ్‌లలోని ఖాతాదారులకు అత్యుత్తమ వాహన సంరక్షణ, సపోర్ట్ అందించ డానికి రూపొందించబడింది. సీజన్‌కు అవసరమైన అన్ని తనిఖీలను ఈ ఈవెంట్ అందిస్తుంది. వర్షాకాలం లో మా క్లయింట్‌లకు తిరుగులేని డ్రైవింగ్ అనుభవాన్ని కలిగి ఉండేలా చేస్తుంది. ఆనందదాయక డ్రైవింగ్ కోరుకునే క్లయింట్‌ల కోసం, సర్వీస్ ఈవెంట్‌లో ప్రత్యేకంగా నిర్వహించబడే డ్రైవర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ఇది వర్షాకాలంలో డ్రైవింగ్, వాహన నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేస్తుంది.
 
క్లయింట్‌లు 2023  జూన్ 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:00 గంట ల మధ్య తమ దగ్గరి అధీకృత జేఎల్ఆర్ రిటైలర్‌తో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయడం ద్వారా ఈ సేవల ను పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ జగన్‌కు చంద్రబాబు లేఖ.. వైసీపీ నేతలే మట్టిని అక్రమంగా..?