Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆహార రంగంలో యూఏఈ పెట్టుబడులు

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (06:47 IST)
యూఏఈకి చెందిన సంస్థలు భారత ఆహార రంగంలో 7 బిలియన్​ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు.

ఎమ్మార్​ గ్రూప్​ నేతృత్వంలోని అక్కడి సంస్థలు వివిధ ప్రాజెక్టుల కింద ఈ మొత్తం వెచ్చించనున్నట్లు తెలిపారు. భారత ఆహార రంగంలో 7 బిలియన్ డాలర్ల మేర యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

యూఏఈ-భారత్ ఫుడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులు ఉంటాయని ఆయన ఓ న్యూస్​ ఛానల్​కు తెలిపారు. దుబాయ్​కి చెందిన ఎమ్మార్ గ్రూప్ నేతృత్వంలోని యూఏఈ సంస్థలు భారత్​లోని వేర్వేరు నగరాల్లో ఉన్న మెగా ఫుడ్ పార్కుల్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నాయని పేర్కొన్నారు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద మరో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అగ్రో కమోడిటీస్, సంబంధిత మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తాయని వివరించారు. భారత్​లో పెట్టుబడులు పెట్టే సంస్థల వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న ఎమ్మార్ గ్రూపు తాము అన్ని సంస్థల పెట్టుబడులను సమన్వయం చేస్తామని పేర్కొంది.

భారత ప్రభుత్వం పాదుర్​లో ఏర్పాటు చేసిన సమగ్ర పెట్రోలియం నిల్వల కేంద్రం స్ఫూర్తిగా.. యూఏఈ ఆహార భద్రత కోసం ఈ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మార్ సంస్థ వెల్లడించింది. ఆహార రంగంలో యూఏఈ పెట్టే పెట్టుబడులతో భారత రైతుల పంటలకు మెరుగైన ధరలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments