Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అంగీకార్' కార్యక్రమంపై అవగాహన.. ఏపీ సీఎస్

Advertiesment
'అంగీకార్' కార్యక్రమంపై అవగాహన.. ఏపీ సీఎస్
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (05:37 IST)
అంగీకార్ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతస్థాయి అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు.

వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్‌లో అంగీకార్ కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగీకార్ కార్యక్రమం ద్వారా వ్యర్ధాల విభజన, పొగ లేని వంటశాల, చెట్లు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందించుట, సమన్వయ జీవనం, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి పొదుపు, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై అవగాహణ కల్పించడం ద్వారా మెరుగైన సమాజం ఏర్పాటుకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ కార్య్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు, ఏపీ టీడ్కో ఎండీ దివాన్ మైదాన్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీర‌వనిత‌లే ఆద‌ర్శం... ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా