Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి విందు : బిర్యానీ కోసం తలలు పగులగొట్టుకున్నారు...

Webdunia
శనివారం, 18 మే 2019 (14:56 IST)
పెళ్లి భోజనం అంటే పది రకాల వంటలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యాలతో పాటు.. నాన్‌వెజ్ వంటకాలు, స్వీట్లు, గారెలు ఉంటాయి. అందుకే పెళ్లి భోజనం అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పైగా, కడుపునిండా ఆరగించవచ్చు. అందుకే విందు భోజనానికి ప్రతి ఒక్కరూ పోటీపడతారు. 
 
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం అజ్జరం గ్రామంలోని ఓ ఇంటిలో ఏర్పాటు చేసిన పెళ్లి భోజనం కొట్లాటకు దారితీసింది. ఈ విందు భోజనంలో వేసిన చికెన్ బిర్యానీ కోసం అతిథులు ఘర్షణకు దిగారు. ఫలితంగా 15 మందికి తీవ్రంగా గాయాలయ్యారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తణుకు పాతూరుకు చెందిన వధువు తరుపు బృందం, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన వరుడి ఇంటి వద్ద వివాహ వేడుకకు శుక్రవారం ఉదయం వచ్చింది. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత భోజనాలు చేస్తుండగా బిర్యానీ గురించి మాటామాటా పెరిగి వధువు, వరుడి వర్గాలు పరస్పరం కొట్టుకున్నారు. 
 
ఈ దాడిలో వరుడి తరుపున ఆరుగురికి, వధువు తరఫున ఆరుగురికి గాయాలయ్యాయి. పెళ్ళి మండపం వద్ద గొడవ జరుగుతోందని సమాచారం రావటంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే ఇరువర్గాలు కొట్టుకోవటంతో గాయాలైన వారిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసామని ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments